భారత్‌లో ప్రారంభమైన సంపూర్ణ చంద్రగ్రహణం..!
ఆదివారం రాత్రి 11 గంటలకు మొదలు
టెలీస్కోప్‌ల ద్వారా ఆసక్తిగా వీక్షించిన ప్రజలు
అవగాహన కల్పించిన నిపుణులు
న్యూఢిల్లీ : ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో పాటు అనేక దేశాల్లో చంద్రగ్రహణం కనిపించింది. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు ఇది ప్రారంభమైంది. ఇక ఇదేరోజు రాత్రి 11 గంటలకు ‘సంపూర్ణ చంద్రగ్రహణం’ మొదలైంది. ఇది తర్వాతి రోజు (సోమవారం) ఉదయం 12.22 గంటలకు ఇదీ వీడనున్నది. అంటే 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలోనే చంద్రుడు ఉండనున్నాడు. అయితే ఈ గ్రహణాన్ని బ్లడ్‌మూన్‌గా పిలుస్తున్నారు. అలాగే సోమవారం ఉదయం 2:25 గంటలకు చంద్రగ్రహణం వీడనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు ఈ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. కాగా ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు పెద్దలు, చిన్నారులు ఆసక్తి కనబర్చారు. టెలీస్కోప్‌ల ద్వారా ఈ దృశ్యాన్ని వారు వీక్షించారు. కాగా నిపుణులు, హేతువాదులు ఈ చంద్రగ్రహణం గురించిన అసలు విషయాలను వివరిస్తూ అపోహలను తొలగించే ప్రయత్నాలు చేశారు. వారికి అవగాహనను కల్పించారు. కాగా ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది.