
మండలంలోని గుర్జకుంట గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ కందడి మనోహర రమేష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎస్ డి ఎఫ్ నిధులతో గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని, గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు గ్రామస్తులు తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మీ నర్సింలు, నాయకులు గోపాల్ రెడ్డి, రాఘువ రెడ్డి, బాల మధుసూదన్, రమేష్, సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.