సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో సీపీఐ(ఎం)లో చేరిన 20 కుటుంబాలు
నవతెలంగాణ-అడ్డ గూడూరు
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని, సమస్యలను పూర్తిగా విస్మరించాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలోని 20 కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. లక్ష్మీదేవి కాలువ సీపీఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శిగా ఎక్కిగ్రవంగ బండి లక్ష్మీనరసింహస్వామిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి సుమారు రెండేండ్లవుతున్నా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ అలవికాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందిపడుతుంటే అధికారులు, పాలకులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కులాలు, మతాల మధ్య పంచాయితీలు పెడుతూ ప్రజలను విడదీస్తుందే తప్ప రాష్ట్రాల ప్రయోజనాలను కాపాటడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ.. గతంలో లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో సీపీఐ(ఎం) బలమైన ఉద్యమాలు చేసి అనేకసార్లు సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచిందన్నారు. సీపీఐ(ఎం)కు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిని బరిలో ఉంచి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో ఆకుల సోమల్లు, భీమనబోయిన భద్రయ్య, పనుమాటి నాగయ్య, ఆకుల సత్యనారాయణ, ఆనంతుల సోమయ్య, మామిడ్ల నర్సయ్య, బండి యాదయ్య, బోమగాని వీరయ్య, పొన్నాల నర్సయ్య, చెరుకు యాకుబ్, చింత లచ్చయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు, అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్‌కుమార్, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలు విస్మరించిన ప్రభుత్వాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES