సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందువులు, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ‘తెలంగాణ విలీనం, వాస్తవాలు, వక్రీకరణలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని తెలిపారు. ఈ పోరాటంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ పోరాటాన్ని ఒకరు విద్రోహమని, ఒకరు విమోచన అని వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు, దేశ్యనాయక్, ఆంజనేయులు బి ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు నరసింహ, పొదిల రామయ్య, శంకర్ నాయక్, కొంపల్లి అశోక్, దశరథం, తారాసింగ్, నాగరాజు, నాయకులు మధు కురుమయ్య మల్లికార్జున్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES