నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదివారం రాత్రి 9.50 గంటల నుంచి 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 85 శాతం మందికి ఈ దృశ్యం కనిపించింది. అయితే గ్రహణ కారణంగా దేశంలోని దాదాపు అన్ని ఆలయాల పాక్షికంగా మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి దేవాలయం మినహా. అయితే రాత్రి 2.25 గంటలకు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం వీడటం తో వివిధ పూజల తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు తెరుచుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయాల శుద్ధి.. సంప్రోక్షణ తర్వాత తెరుచుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం తెరుచుకుంది. అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేశారు. సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లు రద్దు చేశారు. అలాగే విజయవాడ, సింహాద్రి అప్పన్న, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాల్లో పూజలు ప్రారంభం అయ్యాయి. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన వేములవాడ రాజన్న, యాదగిరిగుట్ట ఆలయాల్లో సంప్రోక్షణ పూర్తి చేసిన తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తెరుచుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES