సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కంది
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధినుండి వచ్చిన చెక్కులను ఆయన కార్యాలయంలో సోమవారం లబ్దిదారులకు అందించారు. మొత్తం మూడు లక్షల ఆరువేల విలువ గల 8 చెక్కులను అందించారు. ఇప్పటి వరకు మొత్తం కోటి పది లక్షల కు పైగా విలువైన చెక్కులను అందించినట్టు తెలిపారు.
సీయంఆర్ ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసామని ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్నవారికి ముఖ్య మంత్రి సహాయ నిధినుండి ఆర్థిక సాయంకోసం దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, కొండ గంగాధర్, గుడిపెల్లి నగేష్, బొమ్మకంటి రమేష్,బండారి సతీష్, సంద నర్సింగ్, రామ్ కుమార్, జాఫర్ అహ్మద్,దర్శనాల ఏవన్,ఎం.ఏ షకీల్, కిజర్ పాషా, నాగర్కర్ శంకర్,శ్రీలేఖ ఆదివాసీ, దేశెట్టి ప్రభావతి, ఆలం రూప రోస్లిన్, కందుల సుకేందర్,తమ్మల చందు, జాదవ్ శ్రవణ్ నాయక్, అల్లూరి నారాయణ్ రెడ్డి,ఎల్మ రామ్ రెడ్డి, బేదొడ్కర్ మోతిరామ్, ఉన్నారు.