తహశీల్దార్, ఎంపీడీఓ హాజరు..
నవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రములో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి పలు శాఖల అధికారులు హాజరు కావటం లేదు. దీంతో వివిధ సమస్యలను మండల ప్రజలు ఎదుర్కొంటున్నారు. పలు శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదుల విభాగానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. తాజాగా సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీఓ శివకుమార్ లు మాత్రమే హాజరు కావటం విశేషం. పూర్తి వివరాల్లోకెళ్తే … ప్రతి మండల కేంద్రము లో మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తేవటానికి ప్రభుత్వం ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగంను తహసిల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
అయితే పిర్యాదుల విభాగానికి ఆయా శాఖల అధికారులు తప్పని సారిగా హాజరు కావాలి. అయినా ముధోల్ లో నిర్వహించే ఫిర్యాదుల విభాగానికి పంచాయతీ రాజ్, వ్వవసాయ, వైధ్య, ఇరిగేషన్, విద్యతో పాటు మండలంలోని వివిధ శాఖల అధికారులు హాజరు కావాలి. అయితే ప్రతి సోమవారం ఒక్క, రెండు శాఖల అధికారులు హాజరు అవుతున్నారు. తాజాగా ఈ రోజు తహసిల్దార్, ఎంపిడిఓ మాత్రమే హాజరు కావటం గమనార్హం. పలు శాఖల అధికారులు పిర్యాదు విభాగం హాజరు కావటం లేదు. నిబంధనలు పాటించల్సిన అధికారులు విస్మరించటంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పిర్యాదుల విభాగానికి అన్ని శాఖల అధికారులు హాజరు అయ్యేటట్లు చూడాలని పలువురు కోరుతున్నారు.
ప్రజావాణికి అధికారుల డుమ్మా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES