నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (రామ్మందిర్) లో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎడ్ల సిరిల్ రావు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలంకృతులు చేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానించి సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను కొనియాడారు
ఈ సందర్భంలో విద్యార్థులు , ఉపాధ్యాయులు గురువుల ప్రాధాన్యతపై సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విశేషాలను తెలుపుతూ ఉపన్యసించారు విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ గద్దె గంగాధర్ ,శ్రీమతి పద్మ, మనోహర్, చంద్రకాంత్, నాగేష్ ,హెప్సీబా, సుజాత, రాజన్న ,సురేష్, రాజమణి, చిన్నయ్య, సురేందర్, ప్రభాకర్, గంగాధర్, కిరణ్మయి, బోధనేతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు ఘన సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES