అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఫిజియోథెరపీ భావన నిర్మాణానికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం నగరంలోని ప్రగతినగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన వరల్డ్ ఫిజియోథెరపీ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు..ఆధునిక జీవన శైలిలో ఫిజియోథెరపీ అత్యంత అవసరమైన వైద్య సేవగా మారిందన్నారు.
ఫిజియోథెరపిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయం అని పేర్కొన్నారు. 2025, ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం యొక్క థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ఇది బలహీనత మరియు పడిపోవడాన్ని నివారించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుందని దీని చేరే దిశగా మరింత సేవలు అందించాలని అన్నారు. ఫిజియోథెరపీ డాక్టర్లను అండ్ విద్యార్థుల కార్యకలాపాలను మరింత ప్రోత్సహించే దిశగా ఇందూర్ నగరంలో సొంత భవనానికి తన వంతు సహకారం అందిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ జి శివ కుమార్ అండ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి ప్రమోద్ కుమార్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి సందీప్ కుమార్ అండ్ డా. ఎం. కీర్తి అండ్ డా. అశ్విని జోషి, డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరపీ డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఫిజియోథెరపీ భవన నిర్మాణానికి కృషి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES