నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సుమారు రూ.50,000 విలువ కలిగిన స్పోర్ట్స్ మెటీరియల్ను అందజేసినట్టు ఎంఈఓ నరేందర్, పిడి జి రాజేష్ లు సోమవారం తెలిపారు. మాజీ మంత్రివర్యులు , బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా ఆదివారం అందచేయడం జరిగిందని, ఈ యొక్క క్రీడా సామాగ్రిని ఆలూరు పాఠశాలకు అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని, విద్యాదాత క్రీడా ప్రదాత అభినవ దానకర్ణ, ఏనుగు దయానంద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. క్రీడా సామాగ్రిని అందించిన శ్రీ. వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు క్రీడా సామాగ్రి అందచేయడానికి కృషచేసిన బాల్కొండ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఆలూరు పాఠశాల ఉపాధ్యాయ బృందం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆలూరు ఉన్నత పాఠశాలకు క్రీడా సామాగ్రి అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES