నవతెలంగాణ-సిటీబ్యూరో
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు పనుల్లో కార్మికులు నిమగమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటివరకు రోడ్లపై 15వేల టన్నులు, హుస్సేన్‌సాగర్‌లో 12 వేల టన్నుల విగ్రహాల వ్యర్థాలను తొలగించారు. మండపాలు, నిమజ్జన పాయింట్‌లు, ఊరేగింపు మార్గాలలో పేపర్ షాట్స్, తినుబండారాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిల్స్, డబ్బాలు పేరుకుపోయాయి. వీటిని తొలగించడానికి 15 వేల మంది శానిటేషన్ సిబ్బందితోపాటు అదనపు స్టాఫ్‌ను ఉపయోగించారు. ఉత్సవాలు జరిగిన 11రోజులకు సంబంధించి 27వేల టన్నులకుపైగా విగ్రహాల వ్యర్థాలతోపాటు చెత్తను జీహెచ్‌ఎంసీ కార్మికులు తొలగించి, శుభ్రం చేస్తున్నారు. ప్రారంభం నుంచే కార్మికులను అప్రమత్తం చేసిన అధికారులు ‘ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్’ నిర్వహించారు. రోడ్లపై ఎప్పటికప్పుడూ వ్యర్థాలను కార్మికులు స్వీపింగ్ మిషన్లు, లారీల్లో తీసుకెళ్లి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి జవహర్‌నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగొచ్చని అధికారులు చెబుతున్నారు.
పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES