నవతెలంగాణ – హైదరాబాద్
నవతెలంగాణ బ్యూరో రిపోర్టర్ ఊరుగొండ మల్లేష్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఊరుగొండ లక్ష్మి (70) వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కొంతకాలంగా కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మరణించారు. ఆమె భౌతిక కాయాన్ని పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామానికి తరలించారు. ఆమె అంత్యక్రియలు రాత్రి పూర్తయ్యాయి. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మీ మరణ వార్త తెలిసిన వెంటనే నవ తెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్ తీవ్ర సంతాపం ప్రకటించారు. మల్లేష్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నవ తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ బీవీఎన్. పద్మరాజు, సీనియర్ ఫొటో జర్నలిస్టు కె.ఎన్.హరి, స్టేట్ బ్యూరో రిపోర్టర్ అచ్చిన ప్రశాంత్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
నవ తెలంగాణ బ్యూరో రిపోర్టర్ మల్లేష్‌కు మాతృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES