Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅదానీకి పరువు నష్టం కలిగించొద్దు

అదానీకి పరువు నష్టం కలిగించొద్దు

- Advertisement -
  • అలాంటి వార్తలను ప్రచురించొద్దు
  • తాత్కాలికంగా నిషేధిస్తూ కొందరు జర్నలిస్టులు, వెబ్‌సైట్లకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు

    న్యూఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ గురించి పరువు నష్టానికి సంబంధించిన వార్తలు, కథనాలను పబ్లిష్‌ చెయ్యవద్దని కొందరు జర్నలిస్టులకు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుకూలంగా రోహినీ కోర్ట్స్‌ ప్రత్యేక సివిల్‌ జడ్జ్‌ ఆదేశాలిచ్చారు. ప్రతివాదులు తమ కథనాలు, సోషల్‌ మీడియా పోస్టుల నుంచి అలాంటి విషయాలను తొలగించాలని వివరించారు. ఇందుకు ఐదు రోజుల సమయాన్ని న్యాయమూర్తి కేటాయించారు. ఇలాంటి వార్తల విషయంలో తాత్కాలికంగా నిషేధాన్ని విధిస్తూ ఐదుగురు జర్నలిస్టులు, మూడు వెబ్‌సైట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు జర్నలిస్టుల్లో పరన్‌ జారు, తకుర్తా, రవి నాయర్‌, అబిర్‌దాస్‌ గుప్తా, అయస్కాంత్‌ దాస్‌, ఆయూశ్‌ జోషిలు ఉన్నారు. అలాగే మూడు వెబ్‌సైట్లలో పరన్‌జారు.ఇన్‌, అదానీవాచ్‌.ఆర్గ్‌, అదానీఫైల్స్‌.కామ్‌.ఏయూలు ఉన్నాయి. తమ పరువుకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచురిస్తున్నారనీ, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనీ, ఇది తమ వాటాదారులకు ఆర్థికంగా పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగిస్తోందని ఆరోపిస్తూ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కోర్టులో పరువు నష్టం దావాను వేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad