- Advertisement -
- వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరాభివృద్ధి
- కర్నాటక, హర్యానాను అధిగమించాం
- మూడు నెలల్లో 33.64 శాతం వార్షిక రుణాలు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ. 30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని గుర్తు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇదొక రికార్డు అని గుర్తు చేశారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి, ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని చెప్పారు. రైతులపై ఒత్తిడి చేయకూడదన్నారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. మన తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో (ప్రతి వ్యక్తి ఆదాయంలో రూ. 3.87 లక్షలతో) అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కర్నాటక, హర్యానాను అధిగమించి, ఐదేండ్ల తర్వాత తొలిసారి ఈ అగ్రస్థానాన్ని సాధించిందని అన్నారు. వ్యవసాయం పరిశ్రమలు, సేవా రంగం స్థిరమైన వద్ధితో మొత్తంగా తెలంగాణ దేశంలోనే అత్యంత చురుకైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
మనమందరం దీని నుంచి ప్రేరణ పొంది, మన ప్రజల సమగ్ర సంక్షేమం కోసం మరింత కషికి ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. తెలంగాణ రైసింగ్ లో బ్యాంకర్ల పాత్ర ఉంది ఉన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణాల విభాగంలో మంచి ఫలితాలు సాధించటం పట్ల సంతోషంగా ఉందనీ తెలిపారు. ప్రాధాన్య రంగంలో వార్షిక ప్రణాళిక రుణ లక్ష్యాలలో మొదటి త్రైమాసికంలోనే 33.64 శాతం సాధించడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం నిరంతరం అధిక రేషియోను కొనసాగించడం గర్వకారణమన్నారు. ఈ త్రైమాసికంలో ఇది 126.50 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించి, పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలు ఉన్నాయన్నారు. వీటి ఫలితంగా వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా పెరుగుతోందన్నారు. వీటిలో గణనీయ సంఖ్యలో కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు పునరుద్ధరించి, రైతులకు నిధులు విడుదల చేశామన్నారు. వ్యాపారానికి అనుకూలమైన, సజనాత్మక విధానాలు ప్రభుత్వ చొరవల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి, పరిశ్రమల వద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ. 30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
- Advertisement -