Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబొల్లారంలో యువకుని దారుణ హత్య

బొల్లారంలో యువకుని దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ-ఐడిఎ బొల్లారం
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని కేబీఆర్‌ కాలనీలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి ఇంటి ముందర పడవేసిన సంఘటన సంచలనం రేపింది. బొల్లారం సీఐ రవీందర్‌ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం కేబీఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీను, రాధ దంపతుల కుమారుడు జయప్రకాష్‌ (22) భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్నేహితులతో కలిసి బయటకు వెళుతున్నానని తల్లి రాధకు చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో జయప్రకాష్‌ను ఎక్కడో హత్య చేసి ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఇంటి ముందర పడేశారు. సమాచారం అందుకున్న సీఐ రవీందర్‌ రెడ్డి సంఘటనా స్థలా నికి చేరుకుని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం బృందంతో క్షుణ్ణంగా పరిశీలించారు. పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్‌, మాజీ జెడ్పీటీసీ కొలన్‌బాల్‌ రెడ్డి, గుండ్ల మహేంద్ర రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పటాన్‌ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవీందర్‌ రెడ్డి తెలిపారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad