- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మంగళవారం తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భాష యాసలోను మధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి పద్మభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకున్నారు. ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించి, జీవితాంతం వారి గొంతుకగా బతికిన కాళోజి చిరస్మర నీయులు అని అన్నారు. కాళోజి రచనలతో తెలంగాణ భాష, యాస అందరిని ఆకట్టుకుంటుందని ఆయన అభివర్ణించారు.
- Advertisement -