Thursday, May 8, 2025
Homeతాజా వార్తలుకుక్కల దాడిలో మేకలు మృతి

కుక్కల దాడిలో మేకలు మృతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో కుక్కల దాడిలో మేకలు మరణించాయి. బాధితుడు నవీన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి మేకల కొట్టం దగ్గర మేకలను కట్టేసి వచ్చానని, బుధవారం ఉదయం వెళ్లి చూసేసరికి 8 గొర్లు, 1 మేకపై కుక్క దాడి చేశాయని తెలిపాడు. ఈ దాడిలో 9 జీవాలు మరణించినట్లు తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని విన్నవించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య మేకల మంద వద్దకు వెళ్లి, పంచదామ నిర్వహించారు. సుమారు రూ.70 వేల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -