Wednesday, October 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎన్ సీసీ ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడుతాయి

ఎన్ సీసీ ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడుతాయి

- Advertisement -

ఎన్సిసి కెడెట్ల ఎంపిక పోటీలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

ఎన్సిసి ద్వారా యువతలో శారీరక, మానసిక వికాసంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని ఎన్సిసి సీనియర్ ఆఫీసర్ గాలి అశోక్ అన్నారు. మంగళవారం స్థానిక ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఎన్సిసి కెడెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. వివిధ కళాశాలల నుండి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా.. వారికి లాంగ్ జంప్, హైజంప్, పరుగుపందెం తదితర పోటీలను నిర్వహించి సామర్థ్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్సిసి సీనియర్ ఆఫీసర్ గాలి అశోక్ మాట్లాడుతూ ఎన్సిసిలో ప్రవేశాలకు వివిధ కళాశాలల విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించామన్నారు. ఎంపికైన వారికి మూడేళ్ల పాటు వివిధ స్థాయిలో శిక్షణలుంటాయని తెలిపారు.

శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు సి సర్టిఫికెట్ అందజేయబడుతుందని.. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ తో పాటు యూనిఫాం డ్యూటీలో 60 శాతం వరకు రిజర్వేషన్ కల్పించబడితుందని తెలియజేశారు. ఎన్సిసి ద్వారా దేశభక్తి,  దేశ రక్షణలో సేవ చేసే బాధ్యత, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. లెఫ్టినెంట్ లక్ష్మణ్ పుట్ట మాట్లాడుతూ ఎన్సిసి ద్వారా డ్రిల్, పరేడ్,  ఫైరింగ్ సామాజిక బాధ్యత, జాతి సంక్షేమం దేశ సమగ్రత క్రమశిక్షణ మరియు ఐక్యత అలవర్చుకొని జాతి అభివృద్ధిలో భాగస్వాము కావాలని అన్నారు. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఎన్రోల్మెంట్ అయినటువంటి ఎన్సిసి కాడేట్స్ ను ఉద్దేశించి పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో లెఫ్ట్ నెంట్ భూమన్న, కేర్ టేకర్ చంద్రకాంత్,  బెటాలియన్ అధికారులు సుబేధర్ కావాలజిత్ సింగ్, సుభేదర్ సునీల్ కుమార్, హావలధర్ దేవేందర్ కుమార్, హవాళదేర్ బిఎన్ సింగ్, ఆదిత్య గౌడ్, ఎన్సీసి సీనియర్స్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -