- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
పౌష్టిక ఆహారం తోనే ఆరోగ్యంగా ఉంటామని రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్యం దరిచేరదని, వంటలకు ఉపయోగించే సామాగ్రి ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, తాజా కూరగాయలు మాత్రమే వాడాలని ప్రిన్సిపాల్ అనితకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, వైద్య సిబ్బంది జార్జ్, కస్తూర్బా ఏఎన్ఎం రజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -