నవతెలంగాణ – కాటారం
మంగళవారం కాటారం మండలం లో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కాటారం నందు తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం సందర్భంగా ముందుగా కాళోజీ నారాయణరావు గారి చిత్ర పటానికి ప్రిన్సిపాల్ చల్ల సునీత గారు పూలమాలను అలంకరించి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత విద్యార్థినీలు తెలంగాణ భాష గొప్పదనం వివరించేలా చక్కని పాటలు నృత్య రూపకాలు ఉపన్యాసాలు ప్రదర్శించడం జరిగింది. తెలుగు భాషలోనే మాట్లాడాలి అనే అంశం లో భాగంగా వివిధ ఐచ్చిక అంశాలపై విద్యార్థినీలు మరియు ఉపాధ్యాయులు సరదాగా ఆటవిడుపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కాళోజీ నారాయణరావు జీవిత విశేషాలను స్మరిస్తూ తెలంగాణ భాషను బ్రతికించుకొనుటకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తెలుగు భాషాభిమాని అయిన ప్రిన్సిపాల్ చల్ల సునీత, తెలుగు అధ్యాపకురాలు పాడి కవిత, సరిత లు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చల్ల సునీత, కవిత, సరిత, విజయ, శ్రీలత,నళిని, రాజమణి, స్వప్న,మౌనిక,సుజాత, శిరీష, మణిమాల,అరుణ , రాజమణి, సుజాత, రాజేశ్వరి, లక్ష్మి గార్లు, విద్యార్థినీలు పాల్గొన్నారు.
కస్తూర్బాలో ఘనంగా తెలంగాణ మాండలిక భాష దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES