నవతెలంగాణ-రాయికల్
మండలంలోని అయోధ్య గ్రామానికి చెందిన రైతులు యూరియా ఎరువుల కొరతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాయికల్–జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు రెండు గంటలపాటు ఆందోళన చేపట్టి, తక్షణమే ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..అయోధ్య గ్రామ సొసైటీ గోదాంకు యూరియా లారీని పంపిస్తామని చెబుతూ, వాస్తవానికి అల్లీపూర్ గ్రామ గోదాంకు లారీలు మళ్లిస్తున్నారని,వెంటనే తమ గోదాంకు యూరియా లారీని పంపాలని కోరారు.ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సి.హెచ్. సుధీర్ రావు రైతులతో మాట్లాడి వచ్చే లారీని అయోధ్య గ్రామానికి మళ్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించారు.
రాయికల్–జగిత్యాల రహదారిపై రైతుల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES