మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నరసింహుల గూడెం ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ మండలికి నిలువెత్తు నిదర్శనం అంటే ప్రజా కవి కాళోజి అని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నంత పాఠశాల నరసింహుల గూడెం ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి అన్నారు. మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఘనంగా ప్రజా కవి కాళోజి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యురాలు పద్మావతి మాట్లాడుతూ .. కాలోజీ నారాయణరావు జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు అంటూ స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి అని అన్నారు. సామాన్యుల జీవితంలోని అంశాలను కవితలు, నవలల రూపంలో తెలంగాణ భాషా, యాస ఉపయోగిస్తూ తెలంగాణ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన గొప్ప తెలంగాణ వాది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బి. శ్రీనివాస్, సుకన్య, రమేష్ సంగ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శనం ప్రజాకవి కాళోజీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES