నవతెలంగాణ-పాలకుర్తి
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసామని ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ మండలం నుండి పాలకుర్తి మండలానికి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పోలీస్ సిబ్బంది చెన్నూరు గ్రామ శివారులో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారని, ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ రమేష్, రవి పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES