తాడిచెర్ల ఆరోగ్య కేంద్రం ముందు రోగులు ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితోపాటు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదంటూ మంగళవారం ఆరోగ్య కేంద్రం ముందు ఆయా గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఉన్నతాధికారులు మాత్రం తాడిచెర్ల ఆరోగ్య కేంద్రం 24 గంటల ఆసుపత్రి అని చెప్పడమే తప్పా ఆచరణలో అమలు కావడం లేదని మండిపడ్డారు. ఉదయం 9.30 గంటలకే ఆయా గ్రామాల నుంచి దాదాపు 50 మంది రోగులు ఆరోగ్య కేంద్రంలో నిరీక్షణ చేస్తుంటే వైద్యాధికారి తోపాటు సిబ్బంది ఎవరు లేరని, ఏఎమ్మార్ కంపెనీ సిఎస్ఆర్ కింద పెట్టిన ఒక లేడి సిపర్ మాత్రమే ఉందని తెలిపారు.
ఎలాంటి వచ్చిన రోగులకు ఆ స్వీపర్ బీపీ చూడడం జరిగిందని వాపోయారు. ప్రభుత్వం అందించే వేలాది రూపాయలు వేతనాలు పొందుతున్న ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సూపర్ వైజర్,స్టాప్ నర్స్,ఇంకా ఏఎన్ఎం లు ఆరోగ్య కేంద్రంలో కనిపించడం లేదని,ఒక వైద్యాధికారి, ఏఎమ్మార్ కంపెనీ తరుపున పెట్టిన ఇద్దరు సిబ్బంది మాత్రమే నిత్యం కనిపిస్తున్నారని స్థానిక ప్రజలు,రోగులు వాపోతున్నారు. ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ సిబ్బంది ఉన్నట్లా.?లేనట్లా.? మండల వైద్యాధికారి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.లేదంటే జిల్లా వైద్యాధికారి తోపాటు కలెక్టర్ లకు పిర్యాదు చేస్తామని పలువురు హెచ్చరించారు.
సమయపాలన పాటించని వైద్య సిబ్బంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES