Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఖర్చులతో సతమతం

ఖర్చులతో సతమతం

- Advertisement -

అయోమయంలో 58 శాతం కుటుంబాలు :వాల్డ్‌పానెల్‌ బై నుమెరేటర్‌ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : పెరిగిన ధరలు, ఖర్చులతో దేశంలోని సగంపైగా కుటుంబాలు సతమతం అవుతున్నాయి. ఖర్చులను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదని 58 శాతం కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయని వాల్డ్‌పానెల్‌ బై నుమెరేటర్‌ రిపోర్ట్‌లో తెలిపింది. వినియోగదారులు ట్రెండ్స్‌ను పరిశోధించే ఈ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ 6,000పైగా కుటుంబాల అభిప్రాయాలతో.. ఖర్చా 3.0 అనే అధ్యయనం చేసింది. ఆ వివరాలు.. 2025 మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారతీయుల కుటుంబాల సగటు వ్యయాలు 14 శాతం పెరిగి రూ.56,135కు చేరింది. ఇది ఆదాయం కంటే ఎక్కువని వెల్లడించింది. 2022లో సగటు త్రైమాసిక ఖర్చులు సుమారు రూ.42,000గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు, తక్కువ ఆదాయాలు గల వర్గాలు ఖర్చులలో ఏకంగా 18 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. అదే విధంగా నగరాల్లోని ఉన్నత ఆదాయ కుటుంబాల్లో కూడా త్రైమాసిక ఖర్చులలో 15 శాతం పెరుగుదల నమోదయ్యింది.
భారతీయ కుటుంబాల్లో గత మూడేండ్లలో ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. వినియోగదారులు అవసరమైన ఖర్చులను, రుణ బాధ్యతలను సమతుల్యం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ”ఖర్చులు పెరుగుతున్న నగర, గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు అవసరమైన వస్తువులు, పొదుపు, రుణ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వినియోగదారులు తమ ఎంపికలలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. బ్రాండ్‌లకు ఇది ఒక కీలక సమయం. వారు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరసమైన, అవసరమైన, బాధ్యతాయుతమైన విలువను అందించే విధంగా తమ వ్యూహాలను రూపొందించాలి.” అని వరల్డ్‌ప్యానల్‌ బై న్యూమరేటర్‌ సౌత్‌ ఆసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె రామకృష్ణన్‌ అన్నారు.
దేశంలోని 58 శాతం కంటే ఎక్కువ గృహాలు ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్నాయని తమ రిపోర్ట్‌లో తేలిందన్నారు. ఇది గత సంవత్సరం 38 శాతంతో పోల్చితే చాలా ఎక్కువన్నారు. కేవలం 17 శాతం కుటుంబాలు మాత్రమే సౌకర్యవంతంగా జీవిస్తున్నాయన్నారు. మిగిలినవారు ఏదో విధంగా ఖర్చులను నిర్వహిస్తున్నాయన్నారు. బడ్జెట్‌లు కుంచించుకుపోతుండటంతో భారతీయ వినియోగదారులు తమ ఖర్చులను ప్రాథమిక అవసరాలపై కేంద్రీకరిస్తున్నారన్నారు. సుమారు 80 శాతం మంది అవసరమైన కిరాణా సామాగ్రిని మాత్రమే కొంటున్నట్టు తెలిపారు. చాలా మంది చౌకైన బ్రాండ్‌లకు మారుతున్నారు. ఆకస్మిక కొనుగోళ్లను తగ్గిస్తున్నారన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad