లోగో ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజానాట్యమండలి(పీఎన్‌ఎం) రాష్ట్ర మూడో మహాసభలు వచ్చే ఏడాది జనవరి ఐదు నుంచి ఏడు వరకు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహాసభల లోగోను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 600 మంది ప్రతినిధులు, సినీ, నాటక రంగ, సాంస్కృతిక రంగ ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు. మూడు రోజులపాటు ప్రజానాట్యమండలి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యామ్నాయ జానపద కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ మాట్లాడుతూ ఈ మహాసభలు కేవలం సాంస్కృతిక వేడుకలు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని సాంస్కృతిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను చర్చించే వేదికగా నిలుస్తాయని చెప్పారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ సాంసృతిక రంగ ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ఈ మహాసభల్లో కర్తవ్యాలను తీసుకుంటామని తెలిపారు. ఈ మహాసభలు జయప్రదం కోసం కవులు, కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు, సినీ ప్రముఖులు, అన్ని రకాలుగు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఎండి జబ్బార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎన్ మారన్న,్ట సహాయ కార్యదర్శి కళ్యాణ్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జె.రఘు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో పీఎన్‌ఎం రాష్ట్ర మూడో మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES