నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కాళోజి జయంతి వేడుకను తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కళాశాల ప్రధాన చార్యులు ప్రొఫెసర్ చంద్రముఖర్జీ గారు పాల్గొని కాళోజి గారి గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎంవిఎస్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఎన్ సుభాషిని గారు ముఖ్య అతిథిగా, వక్తగా పాల్గొని కాళోజీ జీవితం, తెలంగాణ యాస, తెలంగాణ జీవన విధానం గురించి చక్కగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉపన్యాసాలు, కవితలు, దేశభక్తి గీతాలు అలరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వి అరుణ్ కుమార్ గారు తెలుగు సహాయ ఆచార్యులు డాక్టర్ భీమమ్మ డాక్టర్ సరిత డాక్టర్ ఎల్లప్ప మరియు అధ్యాపక బృందం బోధ నేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించడం జరిగింది.
ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES