Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమీడియాతో మాట్లాడుతూ కింద‌ప‌డిపోయిన స్వీడన్ మంత్రి

మీడియాతో మాట్లాడుతూ కింద‌ప‌డిపోయిన స్వీడన్ మంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: స్వీడన్‌ కు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్‌ లాన్‌ మీడియాతో మాట్లాడుతూ … ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మంత్రిగా నియమించిన కొద్దిసేపటికే తన పోడియం వద్ద నిల్చని ఉన్న ఆమె ఉన్నట్టుండి కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సెప్టెంబర్‌ 9వ తేదీన స్వీడన్‌ ప్రధానమంత్రి ఉల్ఫ్‌ క్రిస్టర్సన్‌ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలిసబెట్‌ లాన్‌ (48) ను ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతుండగా.. తన పోడియం వద్ద నిల్చని ఉన్న లాన్‌ ఒక్కసారిగా కుప్పకూలి ముందుకు పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమెకు సాయం చేశారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్లే ఆమె ఇలా స్పఅహ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

https://twitter.com/i/status/1965459582400258449
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad