నవతెలంగాణ – డిచ్ పల్లి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రీయలో భాగంగా బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రాజ్ వీర్, అనంత రావు, యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్, పాండు నాయక్ కార్యాలయ సిబ్బందితో కలిసి తుది ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల కేంద్రాల తోపాటు అన్ని గ్రామ పంచాయతిలకు చెందిన జడ్పిటిసి/ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా తుది ఓటర్ల జాబితాను ప్రచురించారు. మండలంలోని అన్ని గ్రామ పంచయతిలలో జడ్పిటిసి/ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రింట్ చేశామని, ఇప్పటికే ఈనెల 8న రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
10న ఫైనల్ ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్ లను ప్రచురించినట్లు ఎంపీడీవోలు రాజ్ వీర్, అనంత రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు లక్ష్మణ్, ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, తిరునగరి శ్రీధర్, ధర్మవరం సింగోటం, షేక్ గౌస్, చుక్క బొట్ల భరత్, అశ్వంత్, అశోక్ కుమార్, అరుణ, స్వప్న ,రజని, సువార్త, బి కవిత, గడ్కోల్ గంగాధర్, బాలకృష్ణ, అజయ్ కుమార్ ,నరేష్ ,సుశీల , సిబ్బంది నితీష్, వినోద్ తోపాటు ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, కరోబార్లు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తుది ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES