అదనంగా ప్రతి నెల 135 క్వింటాళ్ల రేషన్
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో 15 గ్రామ పంచాయతీల్లోని 19 రేషన్ దుకాణాల్లో గతంలో 8,906 రేషన్ కార్డులు ఉండగా..24,709 సభ్యులు ఉన్నారు. వీరందరికీ 399.035 క్వింటాళ్ల రేషన్ బియ్యం ప్రతీ నెల ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే పదేళ్లుగా చాలామంది కొత్త రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పడంతో లబ్దిదారుల్లో ఆశలు చిగురించాయి.
ఆ వెంటనే ప్రభుత్వం మండలంలో ప్రస్తుతం 9,061 రేషన్ కార్డులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.కొత్తగా 974 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఈ కార్డుల్లో సుమారు మూడు వేల మంది సభ్యులు ఉండగా ఉండగా 135.178 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని నూతన రేషన్ కార్డుల లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కొత్త కార్డుల లబ్ధిదారులతో రేషన్ దుకాణాలు సందడిగా మారాయి. రేషన్ కార్డులపై ఆశలు వదులుకున్న తరుణంలో ప్రజలకు ప్రభుత్వం భరోసా నింపడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో లబ్దిదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
రేషన్.. సంబురం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES