క్షణికావేశం.. కుటుంబ సభ్యులకు తీరని శోకం: డిఎస్పి శ్రీనివాసులు
నవతెలంగాణ – అచ్చంపేట
సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి.. ఏది ఏమైనప్పటికీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబ సభ్యులను తీరని శోకం మీగిలిస్తుందని అచంపేట డిస్పి శ్రీనివాసులు అన్నారు. బుధవారం ప్రపంచ ఆత్మ హత్యల నివారరణ దినోత్సవం సందర్బంగా డిస్పి నవతెలంగాణతో మాట్లాడారు. సమస్య చిన్నదైనా.. పెద్దది అయినా దైర్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు సూచించారు. సమస్యకు చావు పరిస్కారం కాదని అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రజలు అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. సాగు చేసి అప్పుల పాలయ్యామని, కష్టపడి చదివిన ఉద్యోగం రాలేదని, వ్యాపారాలలో నష్టాలు వచ్చాయని, మద్యానికి బానిస అవుతున్నారు.
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతి ఏడాది ఆత్మహత్యల సంఖ్య పెరగడం ఆందోళనకు దారి తీస్తుంది. కుటుంబ కలహాలు, వివాదాలు, పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలో ఉచిత న్యాయ వ్యవస్థ ఉంటుంది. సలహాలు సూచనలు తీసుకోవచ్చు. పిల్లల పెంపకం పైన తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలన్నారు. భార్యాభర్తల మధ్య, కుటుంబీకుల మధ్య అపార్తనలు, అనుమానాలు, వేధింపులు, భావవ్యక్తీకరణ లేకపోవడం వల్ల కొన్ని సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా యువత ఆన్లైన్లు యాప్ ల ద్వారా అప్పులు శక్తిని మించి చేస్తున్నారు. వీటికి దూరంగా ఉండాలన్నారు. ఆత్మహత్యల నివారణలో నల్లమల ప్రాంతం లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జీవితం విలువలను తెలియ చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.