– హెలిప్యాడ్ ప్రాంతం, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలపై పోలీసులకు దిశా నిర్దేశం
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో ఈ నెల 15న నిర్వహించే బీసీ డిక్లరేషన్ సమావేశ ప్రాంగణాన్ని జిల్లా ఏఎస్పి సిఐఎస్ఐ లతో కలిసి బుధవారం జిల్లా ఎస్పీ యం, రాజేష్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (తేది: 15.09.2025) కామారెడ్డి లో జరిగే సమావేశానికి వస్తున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ పరిశీలనలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతం, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, విఐపి ల రాకపోకల మార్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణ, విఐపి రాకపోకలు, భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, దిశా సూచికలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని, ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ , దేవునిపల్లి ఎస్సై తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బీసీ డిక్లరేషన్ సభా ప్రాంగనాన్ని పరిశీలించిన ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES