నవతెలంగాణ – బిచ్కుంద
వీరనారి ఐలమ్మ వర్ధంతి వేడుకలు బిచ్కుంద మున్సిపల్ పరిధిలో రజక సంఘం సభ్యులు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, యువజన నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి ఐలమ్మ అని నైజాం నవాబుకు బడ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాట యోధులకు ఆశ్రయమిచ్చి, తన ఇల్లునే కార్యాలయంగా మార్చి ఎందరికో స్ఫూర్తి దాతగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి పటేల్, సాయిని బసవరాజ్, బాల్ కిషన్, నగేష్, రాజు, రజక సంఘం సభ్యులు ఉన్నారు.
ఘనంగా వీరనారి ఐలమ్మ వర్ధంతి వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES