మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలో రైతులకు యూరియా కొరత ఉన్నందున, ఉమ్మడి మాచారెడ్డి మండలం నుండి రామారెడ్డి మండలంలో కలిసిన ఏడు గ్రామపంచాయతీలకు యూరియా ఇబ్బందులు తీవ్రంగా ఉందని బుధవారం మండల బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాచారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో ఏడు గ్రామపంచాయతీలు ఉన్న ఆ రైతులకు యూరియా పంపిణీ చేయకపోవడం తో, మండల కేంద్రంలో వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ నుండి ఏడు గ్రామపంచాయతీల రైతులు ఇబ్బందులతో యూరియాను తీసుకొస్తున్నారని, మాచారెడ్డి సొసైటీ నిమ్మకు నీరెత్తినట్లు, రైతులకు యూరియా సరఫరా చేయకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ఇకనైనా మాచారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో ఏడు గ్రామపంచాయతీల రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి యూరియా సరఫరా చేయాలని, లేదంటే బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి మాచారెడ్డి సొసైటీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
యూరియా కోసం మాచారెడ్డి సొసైటీని ముట్టడిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES