నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామం నుంచి కోన సముందర్ వెళ్లే దారిలో బీటీ రోడ్డుపై గత కొంతకాలంగా వేలాడుతున్న చెట్టు కొమ్మలను బుధవారం కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తన సిబ్బందితో కలసి స్వయంగా తొలగించారు. బషీరాబాద్ గ్రామం నుంచి కోన సముందర్ వెళ్లే మార్గంలో చెట్టు కొమ్మ విరిగి చాలా రోజుల నుండి బీటీ రోడ్డు మీద వేలాడుతుంది. ఈ రోడ్డు గుండా ప్రతిరోజు ఇరువైపులా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు వేలాడుతున్న కొమ్మను గమనించిన తమకేం పట్టనున్నట్లు వెళ్ళిపోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పయనించే వారికి వేలాడుతున్న కొమ్మ కనబడుతున్న కొమ్మను తప్పించుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే రాత్రిపూట ప్రయాణించే వాహనదారులకు ఈ కొమ్మ కనబడక ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది.
వేలాడుతున్న కొమ్మను వాహనదారులు ఎవరు పట్టించుకోవడం గమనిస్తే నాకైతే ఏం కాలేదు.. ఎవరికి ఏమైతే నాకెందుకులే అన్న ధోరణితో ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే తన విధుల్లో భాగంగా బుధవారం కోన సముందర్ వైపు తన సిబ్బందితో కలిసి వెళుతున్న ఎస్ఐ అనిల్ రెడ్డి బీటీ రోడ్డుపై వేలాడుతున్న చెట్టుకొమ్మను గమనించారు. వెంటనే తన జీవును పక్కన ఆపి సిబ్బంది, రోడ్డు గుండా వెళ్తున్న ప్రజలను ఆపి వారితో కలిసి వేలాడుతున్న కొమ్మలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై మనం వెళ్తుంటే రోడ్డుకు అడ్డుగా ఏదైనా ఉంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. నాకెందుకులే అన్న ధోరణితో వెళ్లొద్దని, మనం ఒక్క నిమిషం ఆగి చేసే చిన్న పని ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. ఎస్ఐ అనిల్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
రోడ్డుపై వేలాడుతున్న చెట్ల కొమ్మలను తొలగింపజేసిన ఎస్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES