నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని స్టార్ ఫ్యామిలీ ధాబాపై జుక్కల్ ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మికంగా మెరుపు దాడులు చేసారు. డాబా హోటల్లో మద్యం త్రాగడానికి అనుమతించిన యాజమానిని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మండల పరిధిలోని దాబా హోటల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. అయినప్పటికీ దాబా హోటల్లో మద్యం సేవించడం, సిట్టింగ్ చేయడం , మద్యం అమ్మడం , నిషేధించబడినదిని తెలిపారు. ఒకవేళ దాబా హోటలలో మధ్యమ అనుమతించి సిట్టింగ్ చేసినచో ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించేది ఉండదని, దాబా ఓటర్ల యజమానుల పైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దాబా ఓటర్ల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్సై తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దాబా హోటల్ పై పోలీసుల మెరుపు దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES