– అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గట్టు బస్వా రెడ్డి
– లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి సభ్యుల ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రతి ఒక్కరు సేవా తత్వాన్ని అలవర్చుకోవాలని, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గట్టు బస్వా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు తన వంతుగా సేవ చేయాలన్న సేవ గుణమున్నవారికి లైన్స్ క్లబ్ ఒక వేదికగా దోహదపడుతుందన్నారు. ఎవరైనా సరే చేసిన సహాయాన్ని మర్చిపోయి, ఇతరుల నుండి పొందిన సహాయాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలన్నారు. లైన్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. కమ్మర్ పల్లి మండలంలో కూడా లైన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా లైన్స్ క్లబ్ సేవల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవాలని నూతనంగా లైన్స్ క్లబ్స్ సభ్యులకు సూచించారు.
ప్రజలు ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మాఫియా కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రతి ఒక్కరు తమవంతుగా పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన లైన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ అమర్నాథ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సంస్థ సుమారుగా 200 పైగా దేశాలలో సేవలందిస్తున్న ఏకైక సంస్థ అన్నారు.లయన్స్ క్లబ్ లో సభ్యత్వం పొందడం ద్వారా కలిగే ఉపయోగాలు వివరించారు. లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవల్లో భాగంగా సోషల్ సర్వీస్, క్లబ్ ద్వారా పేదవారికి సహాయం చేయడం, ఆరోగ్య సమస్యలు ఉన్న, కంటి చూపు కంటి మోతి బిందు వంటి ఆపరేషన్లు, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా చేయబడతాయని తెలిపారు.
అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, లైన్స్ క్లబ్ కమ్మర్ పల్లి నూతన కార్యవర్గం, సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమం సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.కార్యక్రమంలో ఆల్ ఇండియా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బసవేశ్వర్, రాజన్న, విశ్వనాథ్, సుధీర్ బాబు, చైతన్య సురేష్, లైన్స్ క్లబ్ కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు లుక్క గంగాధర్, ప్రధాన కార్యదర్శి నెలిమెల గంగారెడ్డి, కోశాధికారి తెడ్డు రమేష్, డైరెక్టర్లు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు సేవా తత్వాన్ని అలవర్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES