‘మల్లేశం, 8 ఏఎమ్, మెట్రో’ చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్. నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తి కరమైన ప్రాజెక్ట్ ’23’తో తాజాగా ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఈ సినిమా ఈనెల 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. హీరో ప్రియదర్శి, లిరిసిస్ట్ చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
డైరెక్టర్ రాజ్ రాచకొండ మాట్లాడుతూ, ‘చాలా స్ట్రాంగ్ టెక్నికల్ టీంతో చేసిన సినిమా ఇది. మార్క్ మ్యూజిక్ చేశారు. చంద్రబోస్, ఇండస్, రెహమాన్ పాటలు రాశారు. కార్తీక్, చిన్మయి, రమ్య బెహరా, కైలాష్ ఖేర్ లాంటి సింగర్స్ పాటలు పాడారు. చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా. థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకుని టెక్నికల్‌గా చాలా ఫోకస్‌తో చేసిన సినిమా ఇది. దయచేసి ఈ సినిమాని థియేటర్స్‌లో చూడండి’ అని చెప్పారు.
’23’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -