ప్రతి మహిళలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి
పాలకుర్తి నియోజకవర్గంలో ఐలమ్మ పుట్టడం, నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం మరపురానిది
రెండు కోట్లతో ఐలమ్మ పేరున ఫంక్షన్ హాల్ నిర్మాణం
ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
ఐలమ్మ భూ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, వెట్టి చాకిరి నుండి ఈ ప్రాంతం విముక్తి పొందిందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో గల ఐలమ్మ చౌక్ లో గల ఐలమ్మ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ .. ఐలమ్మ పోరాటం ప్రతి మహిళలో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ ఐలమ్మ లేనని, ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పాలకుర్తి నియోజకవర్గం లో నియంత పాలనను అంతమొందించారని తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ పాలకుర్తి నియోజకవర్గం లో పుట్టడం, ఆ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం జీవితంలో మరపురాని ఘట్టమన్నారు. పాలకుర్తిలో ఐలమ్మ పేరున రెండు కోట్లతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని త్వరలోనే నిర్మాణ పనులు చేపడతమని భరోసా ఇచ్చారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను కొనసాగిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఐలమ్మ పోరాటపటి మను భావితరాలకు అందించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఐలమ్మ పేరును రాష్ట్రస్థాయిలో గుర్తింపును తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోటీలో గల మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టి పాలకుర్తి కి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించారని తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి మహిళలో దాగి ఉందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఐలమ్మ చేసిన భూ పోరాటాలతోనే ప్రభుత్వాలు అనేక చట్టాలు రూపొందించాయని, భూములు పంపిణీ జరిగాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్లు అడ్డూరి రవీందర్రావు, వీరమనేని యాకాంతారావు, జిల్లా కో ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి మదర్, పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్, పాలకుర్తి పట్టణ అధ్యక్షులు కమ్మగాని నాగన్న గౌడ్, నాయకులు బొమ్మగాని భాస్కర్ గౌడ్, జలగం కుమార్, పెనుగొండ రమేష్, గోనె మహేందర్ రెడ్డి, బండిపెళ్లి మనమ్మ, లావుడియా భాస్కర్, గాదెపాక భాస్కర్, గుగ్గిళ్ళ ఆదినారాయణ, గుగులోతు కిషన్, ఐలమ్మ వారసులు చిట్యాల రాణి, చిట్యాల సంపత్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బిజెపి ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేల్పుల దేవరాజు, పెనుగొండ సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీకి ఉత్సాహాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.