Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికల అధికారిగా మోహన్

గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికల అధికారిగా మోహన్

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘంకి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అధికారిగా జాయింట్ రిజిస్టర్ జిల్లా సహకార అధికారి బి.మోహన్ నియమించారు. ఈ సంఘంలో మొత్తం 100 గొర్రెల పెంపకం దారులు సహకార సంఘం అధ్యక్షులు ఓటు హక్కు కలిగి ఉంటారని పేర్కొన్నారు. మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. 

ఈనెల 12వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 1: 00 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుందని, మధ్యాహ్నం 3: 30 నుంచి 5 గంటల వరకు ఉప సంహరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుందని పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad