– ముగిసిన క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన శిబిరం
– ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం అమలు చేసే ప్రతీ పథకాన్ని నిజమైన అర్హులకు చేర్చడమే ఆది కర్మయోగి అభియాన్ లక్ష్యం అని ఎంపీడీఓ బి.అప్పారావు అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఆదివాసి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ స్థాయి ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం పై మండల పరిషత్ కార్యాలయంలో గ్రామస్థాయి అధికారులకు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన ఆదివాసి ప్రజలలో గ్రామస్థాయి పాలనా భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని,సామాజిక న్యాయాన్ని,సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పెంపొందించడానికి గ్రామ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు.గ్రామ స్థాయిలో అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో గ్రామంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతీ లబ్ధి అందే విధంగా శ్రద్ధ తీసుకునేలా అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్ ఎస్.డి సలీం,అబ్జర్వర్ ఐటీడీఏ డీఈ బాపనయ్య,బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్.సౌజన్య,వైద్యారోగ్యశాఖ డీపీఎంఓ మోహన్,గిరిజన సంక్షేమ శాఖ హెచ్.డబ్ల్యు.ఓ ఎన్.ద్వారక,విద్యాశాఖ ఎస్.ఏ రామచంద్రరావు,సెర్ప్ సీసీ ముత్యాలు,ఎన్జీవో వి.వెంకటేశ్వరావు లు పాల్గొన్నారు.