Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంరేపు అశ్వారావుపేటలో పర్యటించనున్న ఎమ్మెల్యే జారె

రేపు అశ్వారావుపేటలో పర్యటించనున్న ఎమ్మెల్యే జారె

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గురువారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలతో పాటు, సీఎం ఆర్ఎప్ చెక్కుల పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు తన కార్యాలయం నుండి బుధవారం ప్రకటన విడుదల చేసారు.

ఉదయం 10 గంటలకు తిరుమలకుంట,10.30  కు ఆసుపాక,11.00 గంటలకు నారాయణపురం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయనున్నారు. 11:15 కి బచ్చువారిగూడెంలో రూ.12 లక్షల వ్యయం తో నిర్మించనున్న అంగన్వాడీ భవనం శంకుస్థాపన,11:40 కి ఊట్లపల్లి లో విద్యుత్ ఘాతం తో మృతి చెందిన వ్యక్తి  కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చెక్కు అందజేత, మధ్యాహ్నం 12.00 కు రూ.13 కోట్ల 81 లక్షల వ్యయం తో నిర్మించే తారు రోడ్ల నిర్మాణం పై విలేకర్లు సమావేశం,1.30 కు నారంవారిగూడెం లో రూ. 4 లక్షలతో చేపట్టనున్న అభివృద్ది పనులు ప్రారంభం,2.00 కు అచ్యుతాపురం పంచాయితీ దిబ్బ గూడెంలో రూ.10 లక్షల వ్యయం తో నిర్మించనున్న ఎంపీపీఎస్ ప్రహరీ కి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు, పార్టీ స్థానిక కార్యకర్తలు, నాయకులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad