Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉపయోగించుకొని హోప్ ఏఐ ఆంటీ సూసైడ్ మెంటల్ హెల్త్ బూట్ అనే ఆప్ ను బుధవారం తెలంగాణ ఐటి హబ్ హైదరాబాదులో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ యాప్ ప్రపంచంలోనే మొదటిదని ఆత్మహత్యలు జరగకుండా నిరోధించడానికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి పూర్తి మానసిక స్థితిని అర్థం చేసుకొని ఆత్మహత్య నిర్ణయాన్ని వాయిదా వేయడానికి అతని యొక్క సమస్యను పూర్తిగా వెన్నంటి ఉండి బాధితులతో మాట్లాడుతూ.. పరిష్కారం దిశగా ఈ యాప్ పని చేస్తుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, రైతులు, మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడిలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని వారి సమస్యకు పరిష్కారాన్ని ఈ కృత్రిమ మేధస్సు యాప్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ యాప్ సమాజానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈజిసి కౌన్సిల్ మెంబర్ దండు రమేష్.జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజ్మీర జంపయ్య. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ భీముని సారయ్య మల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగవెల్లి సంతోష్. భూక్య మోహన్ చుంచుల ఓదేలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad