Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) మండల స్థాయి క్లాసును జయప్రదం చేయండి..

సీపీఐ(ఎం) మండల స్థాయి క్లాసును జయప్రదం చేయండి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఈ నెల 14వ తేదీన అనాజిపురం గ్రామంలో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) భువనగిరి మండల స్థాయి పార్టీ సభ్యుల క్లాసును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పిలుపు నిచ్చినారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్టీ సభ్యుల క్లాసును జయప్రదం చేయాలని కోరుతూ గ్రామంలోని పార్టీ సభ్యులతో కలిసి ” కరపత్రం ” ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహ, అంజయ్య పాల్గొని మాట్లాడుతూ.. భువనగిరి మండల వ్యాప్తంగా ప్రజల ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ సభ్యులకు అవగాహన కల్పించడానికి క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రధానంగా మండలంలోని పలు గ్రామాలలో పేరుకపోయినా సాగునీరు, లింకు రోడ్లు, మురికి కాలువలతో పాటు, బస్వాపురం ప్రాజెక్టు పూర్తికి రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని, సాగునీటి కాలువలు పూర్తి చేయాలని అన్నారు. మూసీ జల కాలుష్యం అరికట్టి గోదావరి జలాలు అందించాలని, చిన్నేరు వాగు పైన, నాగిరెడ్డిపల్లి జాతీయ రహదారి పైన, ఇంకా వివిధ గ్రామాల్లో ఉన్న కాలువలపైన బ్రిడ్జిల నిర్మాణం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం తీసుకోబోవు పోరాటాల గురించి ఈ క్లాసులలో చర్చించి కర్తవ్యాలను రూపొందిస్తామని వారు తెలిపారు. ఈ క్లాసులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ బోధిస్తారని ఈ క్లాసులలో పార్టీ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ, అంజయ్య లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మాజీ మండల కార్యదర్శి డా. బొల్లెపల్లి కుమార్, పార్టీ మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, గ్రామ శాఖ కార్యదర్శులు ఏదునూరి వెంకటేశ్, కడారి కృష్ణ , గ్రామ నాయకులు తోటకూరి మల్లేష్, బోల్లెపల్లి స్వామి, గంగదారి వెంకటేష్, గంగనబోయిన బాల్ నర్సింహ, చేకూరి రాజు, నానాపురం నాగయ్య, కడారి మహేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad