Thursday, May 8, 2025
Homeట్రెండింగ్ న్యూస్హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ..

హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆక్రమ‌ణ‌దారుల‌పై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇప్పుడు పోలీసు స్టేష‌న్ తోడ‌య్యింది. హైడ్రా కార్యాల‌యం బుద్ధభ‌వ‌న్ ప‌క్కనే హైడ్రా పోలీసు స్టేష‌న్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభిస్తున్నారు. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరే సొంతంగా పోలీసు స్టేష‌న్ తోడ‌వ్వడంతో హైడ్రా కార్య‌క‌లాపాల‌కు మ‌రింత బ‌లం స‌మ‌కూర‌నుంది. ఈ పోలీసు స్టేష‌న్‌కు ఎస్‌హెచ్‌వోగా ఏసీపీ పి. తిరుమ‌ల్ నియ‌మితుల‌య్యారు. ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతానికి ఈ పోలీసు స్టేష‌న్‌కు కేటాయించారు. జీ+2గా నిర్మాణ‌మైన ఈ పోలీసు స్టేష‌న్‌లో 10,500ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -