Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలి: కలెక్టర్

మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మెనూ ప్రకారం విద్యార్థులకు రుచి కరమై భోజనం పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. టీచర్స్ అందరూ రెగ్యులర్ గా విధులకు హాజరవుతున్నారా, ఎవరైనా విధులకు హాజరు కాకుండా ఉన్నారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంటగదిని  పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 

విద్యార్థులకి రోజు  ఇచ్చే భోజనం మెనూ ప్రకారం నాణ్యత ఉందా లేదా అని పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. విద్యార్థులకి ఇచ్చే భోజనం లో కూరగాయలు తక్కువగా కనిపిస్తున్నాయని, కానీ ఎందుకు తక్కువ ఇచ్చార అని వార్డెన్ ని అడిగితే కాంట్రాక్టర్ సరిగా సరఫరా చేయడం లేదని చెప్పడంతో వెంటనే కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి  వెంటనే విద్యార్థులకి సరిపడా కూరగాయలు నాణ్యత తో ఉన్న కూరగాయలు తేవాలని ఇవ్వాలని ఆదేశించారు, లేనిచో చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.

స్కూల్ కి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు తో మాట్లాడారు,  స్కూల్ లో ఫుడ్ బాగుంటుందా, స్టడీ బాగుంటుందా అని విద్యార్థుల తల్లిదండ్రులను  అడిగి తెలుసుకున్నారు. స్కూల్ లో ఎవరైనా విద్యార్థులు జ్వరాల బారిన పడితే వాళ్ళ ను గుర్తించి, రెగ్యులర్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్లి చూపించాలి అన్నారు. అనంతరం మండలం అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.  గ్రామంలో మొత్తం మంజూరు అయినా ఇండ్లు ఎన్ని , అవి ఏ ఏ దశలల్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరు కూడా ఆలస్యం చేయకుండా ఇంటి నిర్మాణ పనులు వేగవంతం పూర్తి చేసుకోవాలన్నారు. 

హౌసింగ్ ఏ ఈ లు నిరంతరం ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించాలని, పనులు పూర్తి అయిన వెంటనే ఫోటో కాప్చర్ చేసి అప్లోడ్ చేయాలి ఫోటో కాప్చర్ ఆలస్యం చేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad