‘హర్రర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడూ చూడలేదు. హర్రర్, మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ‘కిష్కింధపురి’. ఆడియన్స్‌కి సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చెప్పారు.
కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘కిష్కింధపురి’. ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బుధవారం మీడియాతో ముచ్చటించారు.
చాలా రోజుల తర్వాత ‘కిష్కింధపురి’తో ఒక స్ట్రయిట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ సినిమా అందిస్తుంది.
వర్క్ మొత్తం పూర్తయ్యాక ఫస్ట్ టైం థియేటర్స్‌లో మా సినిమాని చూసాం. అదిరిపోయింది. ముఖ్యంగా సౌండ్. ‘సలార్, యానిమల్, కాంతారా’ సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకష్ణ సౌండ్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. హర్రర్, మిస్టరీ ఉన్న ఒక కొత్త జోనర్ ఇది.
థ్రిల్లర్ జోనర్‌లో చేసిన ‘రాక్షసుడు’కి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. మహిళా ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకి గొప్ప ఆదరణ లభించింది. ఈ సినిమాకి కూడా అంతే ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నా. దర్శకుడు కౌశిక్ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ మా నిర్మాత సాహు గారపాటి ఆడియన్స్‌కి ది బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్‌గా, గ్రాఫిక్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది. అనుపమ పెర్ఫార్మెన్స్ కొత్తగా ఉంటుంది. నిజానికి అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా టఫ్. ప్రస్తుతం చేస్తున్న ‘టైసన్ నాయుడు’ షూటింగ్ అయిపోయింది. ‘హైందవ’ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్‌తో ఒక సినిమా ఉండబోతుంది.
ఇంత వరకూ రాని హర్రర్ సినిమా
- Advertisement -
- Advertisement -