- Advertisement -
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ కోసం ఒక కలర్ ఫుల్ పాటను చిరంజీవి, నయనతారపై హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. వీరి సెట్‌కి సమీపంలో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కలిసి చేస్తున్న మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందులో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. బుధవారం షూటింగ్ గ్యాప్‌లో వీరంతా కలిసినప్పుడు దిగిన ఫొటో వైరల్ అయ్యింది.
- Advertisement -