Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeసినిమాసీజన్‌ 3కి మించి..

సీజన్‌ 3కి మించి..

- Advertisement -

తెలుగులో అతి పెద్ద సింగింగ్‌ షో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4 ఆహాలో సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సీజన్‌లో టాప్‌ 12 కంటెస్టెంట్స్‌ టాలెంట్‌ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో చూడొచ్చు.
ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు తమన్‌, గాయకులు కార్తీక్‌, గీతా మాధురి జడ్జెస్‌గా, శ్రీరామ చంద్ర హోస్ట్‌గా, సమీరా భరద్వాజ్‌ కో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బుధవారం తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4 స్పెషల్‌ స్క్రీనింగ్‌ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్‌ మీట్‌ లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మాట్లాడుతూ, ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4 చేసే అవకాశాన్ని నాకు కల్పించింది అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌. వారికి థ్యాంక్స్‌. ఈ షో మాలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చింది. దాదాపు 6 వేల మంది కంటెస్టెంట్స్‌ నుంచి 12 మందిని సెలెక్ట్‌ చేయడం అంటే ఎంత టాలెంట్‌ పోటీ పడిందో అర్థం చేసుకోవచ్చు. మా కన్సర్ట్స్‌కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. అలాంటి గుర్తింపు మాకు ఈ షో తీసుకొచ్చింది. నేను చేసిన సినిమాలు వాళ్ల ఇంటిదాకా తీసుకెళ్తే, ఈ షో నన్ను ప్రేక్షకుల ఇంటిలోపలికి తీసుకెళ్లింది’ అని తెలిపారు.
‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 అద్భుతంగా వచ్చింది. అంత బాగా మీరు చేస్తానంటేనే సీజన్‌ 4కు ఇన్వెస్ట్‌మెంట్‌ పెడదాం అని అన్నాను. గత సీజన్‌ కంటే ఈ సీజన్‌ 4 బాగా చేస్తున్నారు. ఈ షోకు తమన్‌ లైఫ్‌ తీసుకొచ్చాడు’ అని నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad