అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో ప్రైమ్ వినియోగదారులకు అత్యంత వేగంగా డెలివరీలను అందించడానికి ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెజాన్ ఇండియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జీబా ఖాన్ మాట్లాడుతూ.. ప్రైమ్ మెంబర్లకు అదే రోజు 10 లక్షల ఉత్పత్తులను డెలివరీ చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. 1.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను సృష్టించామన్నారు. ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందే కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి 57,000 మందికి పైగా విక్రేతలు మొబైల్ ఫోన్లు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, కిచెన్ తదితర శ్రేణీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నారన్నారు. 18,000 మందికి పైగా స్థానిక దుకాణాలు హోం, కిచెన్, ఫర్నిచర్ శ్రేణుల్లో ఉత్పత్తులను విక్రయించనున్నారన్నారు.
ఒక్క రోజులోనే10 లక్షల ఉత్పత్తుల డెలివరీ
- Advertisement -
- Advertisement -